తాడేపల్లి రూరల్: వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా సమ్మిట్ (సదస్సు) ను ఉమెన్ డెవలప్మెంట్సెల్ ఆధ్వర్యంలో శుక్ర వారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజ రైన పలువురు మహిళా మణులతో కలిసి ప్రో.చా న్సలర్ డాక్టర్ కె.ఎస్.జగన్నాథరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్చార్జి డీన్ డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్ జ్యోతి ప్రజ్వ లన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
ఈ సద స్సుకు గుంటూరుకు చెందిన సమగ్ర ఆస్పత్రి కన్స ల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కె.నీరజ, యూఎస్ఏ సాడ్ డియగో యూనివర్శిటీ డీన్ డాక్టర్ మహాశ్వేత సర్కార్, కాసా ఎలైట్ డైరెక్టర్ ప్రీతి కొరటాల, రాష్ట్ర విపత్తుల శాఖ మేనేజర్ యశశ్విని పెద్ది, చినోయ్ డిజైన్ మేనేజింగ్ డైరెక్టర్ సాందీపని వజ్జి, అఖిల భారత సైకలాజికల్ అసోసియేషన్ గౌరవ అధ్య క్షులు కె. లక్ష్మి తులసిబాయి, వాసవ్య మహిళా మం డలి అధ్యక్షురాలు బొల్లినేని కీర్తి, హోప్ విన్ ఆస్ప త్రుల వ్యవస్థాపక సీఈఓ ఎండీ షమా సుల్తానా, ది స్టెమ్ మేకర్ వ్యవస్థాపక సీఈఓ ఆష క్రాంతి నందిగం, ఏపీ హై కోర్టు న్యాయవాది అనుపమ దార్ల, కేఆర్ఆర్ ఇన్నోవేషన్ డైరెక్టర్ సిఇవో రష్మితరావు, లిటిల్ బ్లాక్ స్టార్ కో ఫౌండర్ తిరుమల శెట్టి మేఘన, సేఫ్, ఫన్ టైమ్ ఉపాధ్యక్షురాలు సుమ అట్లూరి ముఖ్యఅతిథులుగా హాజరై తమ అభిప్రా యాలు వెలిబుచ్చారు. ఏడు అంశాలపై బృం దాలుగా ఏర్పడి చర్చలు జరిపారు. మహిళా సమ్మిట్ చైర్పర్సన్గా డాక్టర్ రూతు రమ్య వ్యవహ రించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ కార్యదర్శి కోనేరు శివకాంచనలత తదితరులు పాల్గొన్నారు
Ms. Asha from The STEM Makers delivered a keynote address on “Education and Skill Development” at the International Women’s Summit, held on April 4th at KLEF.
https://www.instagram.com/p/DIQvgUgTPsG/?igsh=MTd6Znd3cWlwZ3duYw%3D%3D
This article was published on April 5, 2025, in Sakshi newspaper on page 8.